ఆ విషయం బాబు ఎందుకు బయటపెట్టడం లేదు?

Ambati Rambabu Fires On Chandrababu Naidu - Sakshi

చం‍ద్రబాబుపై మండిపడ్డ అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి : ఎల్జీపాలిమర్స్‌తో లాలూచీ పడాల్సిన అవసరం​ తమ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో లాలుచీ పడి సింహాచల ఆలయ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విశాఖ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డ వేగంగా స్పందంచారని, ప్రమాదం జరిగిన రోజే బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు. గ్యాస్‌ బాధితులకు కనివినీ రీతిలో సాయం చేశారన్నారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్‌ అయితే.. ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని విమర్శించారు.(చదవండి : అలాంటి వార్తలు రాయొద్దు: మంత్రి బొత్స)

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభిస్తే.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల ప్రమాదానికి కారణమైనవారిలో ఎంతమంది అరెస్ట్‌ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  విశాఖకు వచ్చేందుకు చంద్రబాబు కేంద్రం పర్మిషన్‌ ఇచ్చిందో లేదో తెలియదని, ఆ విషయాన్ని చద్రబాబు ఎందుకు బయటపట్టడం లేదని ప్రశ్నించారు.
(చదవండి : గ్యాస్‌ లీక్‌ : సీఎం జగన్‌ సహాయం ఓ నిదర్శనం)

బాధితులను పరామర్శించే మనసు ఉంటేకారులో కూడా విశాఖకు రావొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేదన్నారు. సీబీఐని రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితమంతా రాజకీయ కుట్రలేనని అంబటి విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top