దళిత సాహిత్యంపై హెచ్‌సీయూలో సదస్సు నేడు | Conference on Dalit Literature at HCU | Sakshi
Sakshi News home page

దళిత సాహిత్యంపై హెచ్‌సీయూలో సదస్సు నేడు

Feb 25 2015 11:52 PM | Updated on Sep 2 2017 9:54 PM

‘దళిత-బహుజన సాహిత్యం: చింతన-సమాలోచన’ అనే అంశం మీద నేడు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సదస్సు ఏర్పాటయింది.

‘దళిత-బహుజన సాహిత్యం: చింతన-సమాలోచన’ అనే అంశం మీద నేడు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సదస్సు ఏర్పాటయింది. దళిత ఆదివాసీ అధ్యయన, అనువాద కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో నాగప్పగారి సుందరరాజు, కేసరాజు కొమరన్న, కలేకూరి ప్రసాద్, పైడి తేరేష్‌బాబుల దృక్కోణాలపై చర్చ జరుగుతుంది. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో ఉదయం పది గంటలకు కార్యక్రమం మొదలై సాయంత్రం ఐదు గంటల సదస్సుతో ముగు స్తుందని ఆదివాసీ అధ్యయన అనువాద కేంద్రం తెలియ చేసింది.
 
 ఇ. హరిబాబు, వి. కృష్ణ, జయధీర్ తిరుమల రావు, శరత్‌జ్యోత్స్నారాణి, కొలకలూరి ఇనాక్, ఆర్ ఎస్ సర్రాజు, ఎండ్లూరి సుధాకర్, తుమ్మల రామకృష్ణ, కె. సునీతరాణి, దార్ల వెంకటే శ్వరరావు, గోగు శ్యామల, బిఎస్ రాములు, పిల్లలమర్రి రాములు, కదిరె కృష్ణ, వేముల ఎల్లయ్య, బండి డానియల్, కోయి కోటేశ్వరరావు, జూపాక సుభద్ర, సి. కాసిం, శిఖామణి, దాసోజు లలిత, వినోదిని తదితరులు చర్చలలో పాల్గొంటున్నారు. ఉదయం సదస్సులో ‘బహు జన సాహిత్య దృక్పథం’ (దార్ల వెంకటేశ్వరరావు), ‘గుళ్ల’ (కొమరన్న) పుస్తకాల ఆవిష్కరణ కూడా జరుగుతుంది.
 ప్రొ॥ఆర్.ఎస్. సర్రాజు హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement