సింగపూర్‌ లో 'వాక్‌ విత్ జగనన్న' | Walk with jagananna in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ లో 'వాక్‌ విత్ జగనన్న'

Jan 28 2018 3:53 PM | Updated on Jul 25 2018 5:17 PM

Walk with jagananna in Singapore - Sakshi

సింగపూర్‌ : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1000కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా సింగపూర్‌లో  నివసిస్తున్న ప్రవాసాంధ్రులు వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.  సింగపూర్‌ వైఎస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన వాక్ విత్ జగనన్న కార్యక్రమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చూడాలన్నది తెలుగువారి ఆకాంక్షగా వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం కలిసికట్టుగా వైఎస్ జగన్‌కు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌ వైఎస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ కన్వీనర్లు బొమ్మ శ్రీనివాసులు, జయప్రకాశ్‌, మహేష్, కృష్ణా రెడ్డి, సంతోష్‌, మురళి, రామచంద్ర, రంగా, రాజు, మల్లన్న, జీవన్‌, సంకే శ్రీని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement