ఆస్ట్రేలియాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి | Telangana software Engineer dies in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి

Dec 25 2017 8:26 PM | Updated on Dec 25 2017 8:34 PM

Telangana software Engineer dies in Australia - Sakshi

సాక్షి, నల్లగొండ : ఆస్ట్రేలియాలో తెలంగాణవాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోన ఆదినారాయణ రెడ్డి(33) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉద్యోగం కోసం ఆరు నెలల కిందట సిడ్నీ వెళ్లిన కోన ఆదినారాయణ రెడ్డి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) సాయంత్రం చివరిసారిగా మిర్యాలగూడలో ఉంటున్న భార్య శిరీషతో ఆదినారాయణ మాట్లాడారు.

ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో రూమ్ కి వెళ్లి చూడాలని మిత్రులను కుటుంబ సభ్యులు కోరారు. ఇంటికి వెళ్లిన మిత్రులకు ఆదినారాయణ విగతజీవిగా కనిపించాడు. భర్త మరణవార్త వినగానే శిరీష కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఆదినారాయణ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. శిరీష-ఆదినారాయణకు మూడేళ్ల కవల పిల్లలున్నారు. ఆదినారాయణ మృతదేహాన్ని తీసుకురావడంతో పాటు అతడి మృతిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement