11,12 తేదీల్లో  దుబాయిలో రాహుల్‌ పర్యటన | Rahul Gandhi To Visit In Dubai | Sakshi
Sakshi News home page

11,12 తేదీల్లో  దుబాయిలో రాహుల్‌ పర్యటన

Jan 4 2019 9:00 AM | Updated on Mar 18 2019 7:55 PM

Rahul Gandhi To Visit In Dubai - Sakshi

రాహుల్‌ పర్యటనపై జరిగిన సన్నాహక సమావేశంలో కేరళ మాజీ సీఎం  ఉమెన్‌చాందీని సన్మానిస్తున్న ఎస్‌.వేణురెడ్డి  ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షుకు బొకే అందజేస్తున్న తెలంగాణ ప్రవాసీ కాంగ్రెస్‌ నాయకుడు మంద సుమంత్‌రెడ్డి

గల్ఫ్‌ డెస్క్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 11, 12 తేదీలలో దుబాయిలో పర్యటించనున్నారు. దుబాయి క్రికెట్‌ స్టేడియంలో గల్ఫ్‌ ఎన్నారైలతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ,ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు సి.వ్యాస్‌ గతకొన్ని రోజులుగా దుబాయిలో ఉండి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (ఐఓసీ) మిడిల్‌ ఈస్ట్‌ (మధ్య ప్రాశ్చ) కన్వీనర్‌ మన్సూర్‌ పల్లూర్‌ రాహుల్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అన్ని గల్ఫ్‌ దేశాల నుంచి ఎన్నారైలు ఇందులో పాల్గొంటారని పీసీసీ ఎన్నారై సెల్‌ దుబాయి కన్వీనర్‌ ఎస్‌.వేణురెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement