యూఎస్‌లో భారతీయ కుటుంబం అదృశ్యం

Indian Family Missing In USA Suspected To Be Swept In Floods - Sakshi

వరదల్లో కొట్టుకుపోయిందనే అనుమానం

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాలో భారతీయ కుటుంబం అదృశ్యం సంచలనం కలిగిస్తోంది. భారత్‌కు చెందిన సందీప్‌ తోటపల్లి, ఆయన భార్య సౌమ్య, ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచిలు ఏప్రిల్‌ 5న మెరూన్‌ హోండా పైలట్ కారులో పోర్ట్‌లాండ్‌ నుంచి శాన్‌జోష్‌ వెళ్తూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారని స్థానిక మీడియా ప్రచురించిది. అయితే స్థానికంగా ఏప్రిల్‌ 6న ఈల్‌ నదిలో వచ్చిన వరదల్లో ఒక కారు కొట్టుకుపోయిందని, అది అదృశ్యమైన భారతీయుడు కారును పోలిఉందని హైవే పెట్రోలింగ్‌ అధికారి విలియం తెలిపారు. 

ప్రాధమిక విచారణలో ప్రత్యక్ష సాక్షలను విచారించగా వరదల్లో కొట్టుకుపోయిన కారు 2016 లేదా 2017లో విడుదలైన హోండా కారుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం కారును గుర్తించే పనిలో ఉన్నామని, కానీ ఇప్పటి వరకూ ఆచూకీ దొరకలేదని అధికార వర్గాలు తెలిపాయి. సంపదీప్‌ కారు ఈల్‌ నదిలో కూడా కొట్టుకుపోయిన కారు ఒకే విధంగా ఉన్నాయని, కానీ ఖచ్చితంగా నిర్ధారించలేమని అధికారులు అన్నారు. ఆచూకీ తెలియగానే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్‌ స్పందించారు. ఈ సంఘటనసై వివరణ ఇవ్వాలంటూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారిని ఆదేశించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top