లైగింక వాంచ తీర్చలేదని ప్రియుడి ఘాతుకం | Woman pushed from second floor | Sakshi
Sakshi News home page

లైగింక వాంచ తీర్చలేదని ప్రియుడి ఘాతుకం

Jul 2 2017 4:13 PM | Updated on Aug 25 2018 4:14 PM

లైంగిక వాంచ తీర్చలేదని ఓ యువతిని ఆమె ప్రియుడు రెండో అంతస్తుపై నుంచి తోసేశాడు.

లక్నో: ఉత్తర్‌ ‍ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. లైంగిక వాంచ తీర్చలేదని  20 ఏళ్ల ఓ యువతిని ఆమె ప్రియుడు ఇంటి రెండో అంతస్తుపై నుంచి తోసేశాడు. ఈ ఘటన శనివారం ముజఫర్‌ నగర్‌ సమీపంలోని షామిల్స్‌ జిల్లా కించనా నగరంలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయిందని దీన్ని వ్యతిరేకించిన నిందితుడు ఆమెను లైంగిక వేదింపులకు గురి చేశాడని, దీనికి సహకరించనందుకు ఆమెను తోసేశాడని పోలీసులు తెలిపారు.  బాధితురాలిని స్థానికులు ఆస్పుత్రికి తరిలించారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టకుంటామని పోలీసులు ఆదివారం  మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement