‘మోదీ కోసం పెళ్లి చేసుకున్నా.. నరకం అనుభవించా’

Woman married Gujarat man for PM Modi Now Accused Husband Of Torturing Her - Sakshi

అహ్మాదాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానంతో జయదవేను పెళ్లి చేసుకున్నాను. కానీ మానసికంగా, శారీరకంగా అతను నన్ను హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు అల్పికా పాండే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారేవరైనా అల్పికను త్వరగానే గుర్తు పడతారు. ఎందుకంటే నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానంతో.. సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది అల్పిక.

వివరాలు.. గుజరాత్‌కు చెందిన జయదవే అనే వ్యక్తి గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని విమర్శిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ను అల్పికా పాండే లైక్‌ చేసింది. అప్పటి నుంచి వీర‍ద్దరి మధ్య ఫేస్‌బుక్‌ స్నేహం ప్రారంభమైంది. మోదీ అంటే ఇద్దరికి విపరీతమైన అభిమానం. ఆలోచనలు కలిశాయి కాబట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ జంట. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌ 31న జయదవే.. ‘మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. మేం ఇద్దరం మోదీకి మద్దతు తెలుపుతున్నాం. మేమిద్దరం దేశం కోసం జీవించాలనుకుంటున్నాం.. అందుకే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం’ అంటూ ట్వీట్‌ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అయ్యింది కూడా.

ఆ తరువాత 2019, జనవరిలో వీరిద్దరు వివాహం చేసుకున్నారని సమాచారం. కానీ పెళ్లైన నెల రోజులకే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాను పడుతున్న బాధల గురించి ట్వీట్‌ చేశారు అల్పిక. ‘నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానంతో ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన జయదవేను వివాహం చేసుకున్న అమ్మాయిని నేనే. అయితే ఈ బంధంలోని మరో కోణం గురించి కూడా మీకు తెలియాలి. నా భర్త నన్ను శారీరకంగా, మానసికంగా చాలా హింసిస్తున్నాడు. ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అంటూ వాపోయింది అల్పిక.

అంతేకాక ‘జయదవేకి నా మీద చాలా అనుమానం. ‍ప్రతీక్షణం నేను ఏం చేస్తున్నానే విషయం అతనికి తెలియాలి. నాకు తెలియకుండా నా ఫోన్‌ని చెక్‌ చేసేవాడు. నా వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వడు. నేను ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా వీల్లేదు. గౌరవం పేరుతో ఎవర్నో ఒకర్ని నాకు తోడుగా పంపిస్తాడు. నన్ను బాధ పెట్టే విషయంలో అతని కుటుంబ సభ్యులు కూడా అతనికే మద్దతు ఇస్తారు’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ టార్చర్‌ తట్టుకోలేక జయదవే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని.. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది అల్పిక. అంతేకాక పెళ్లి చేసుకోవాల్సిందిగా జయదవేనే తనను బలవంత పెట్టాడని ఆరోపించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top