ఎన్‌కౌంటర్‌ : మహిళా మావోయిస్టు మృతి | woman maoist died in encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌ : మహిళా మావోయిస్టు మృతి

Sep 11 2017 4:41 PM | Updated on Sep 19 2017 4:22 PM

ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది.

ఒడిశా: ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది. మిలీషియా రిజర్వు ఫారెస్టులో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌ఓజి), మావోయిస్టు మిలిటెంట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారని, ఎస్‌ఓజీ జవాన్లు తిరిగి కాల్పులు జరపగా ఒక మహిళా మావోయిస్టు మృతిచెందినట్లు ఎస్‌పీ మిత్రభాను మోహపత్ర తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారన్నారు.
 
మృతురాలిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయపడిన జవాన్లు బోంజంగ్‌ తోమంగ్‌, విద్యాధర్‌ సేథ్‌లను బర్హన్‌పూర్‌ ఎంకేసీజీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో ఒక పిస్టల్‌, మందుగుండు సామగ్రి, పాత్రలు, మందులు కనుగొన్నామని, వాటిని సీజ్‌ చేసినట్లు, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement