ఫ్లై ఓవర్ నుంచి దూకేసిన మహిళ | Woman jumps from flyover, critical | Sakshi
Sakshi News home page

ఫ్లై ఓవర్ నుంచి దూకేసిన మహిళ

Jul 27 2014 6:36 PM | Updated on Sep 2 2017 10:58 AM

దేశ రాజధానిలో బసంతి అనే మహిళ ఫ్లై ఓవర్ నుంచి దూకేసింది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బసంతి అనే మహిళ ఫ్లై ఓవర్ నుంచి దూకేసింది. కుటుంబ సమస్యల వల్ల ఆదివారం ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

చికిత్స నిమిత్తం బసంతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె రెండు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ ఢిల్లీలోని పీరా గరి ఫ్లై ఓవర్ నుంచి దూకింది. ఇదే ప్రాంతంలోని నజఫ్గడ్లో బసంతి నివసిస్తోంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ఆమె మానసిక ఒత్తిడికి గురైనట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement