విద్యార్థిని, వివాహితలపై సామూహిక అత్యాచారం | woman gangraped in Muzaffarnagar | Sakshi
Sakshi News home page

విద్యార్థి, వివాహితపై సామూహిక అత్యాచారం

Sep 24 2014 3:01 PM | Updated on Sep 2 2017 1:54 PM

విద్యార్థిని, వివాహితలపై సామూహిక అత్యాచారం

విద్యార్థిని, వివాహితలపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్లో మరో రెండు దారుణ సంఘటనలు వెలుగు చూశాయి.


ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో మరో రెండు దారుణ సంఘటనలు వెలుగు చూశాయి. వేర్వేరు సంఘటనల్లో ఓ దళిత విద్యార్థిని, మరో వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

ముజఫర్నర్ జిల్లా షామ్లీ ప్రాంతంలో నివసిస్తున్న 26 ఏళ్ల వివాహితపై గత ఫిబ్రవరిలో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి, ఈ విషయం బయటకు చెప్పవద్దని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. చివరకు ఆమె భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను సలీమ్, అబిద్, భూరాగా గుర్తించారు. పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు. మిగిలివారి కోసం గాలిస్తున్నారు.

బాదౌన్లో 16 ఏళ్ల దళిత విద్యార్థినిపై ముగ్గురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెకు వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. బాధితురాలు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఇంటిపక్కన నివసిస్తున్న వ్యక్తి, అతని ఇద్దరు స్నేహితులను నిందితులుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్ను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement