విలియమ్ మనోడే! | William was belongs to our nation? | Sakshi
Sakshi News home page

విలియమ్ మనోడే!

Apr 11 2016 2:09 AM | Updated on Sep 3 2017 9:38 PM

విలియమ్ మనోడే!

విలియమ్ మనోడే!

బ్రిటన్ యువరాజు విలియమ్‌కు భారతీయ మూలాలున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: బ్రిటన్ యువరాజు విలియమ్‌కు భారతీయ మూలాలున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. విలియమ్ తల్లి ప్రిన్సెస్ డయానా పూర్వీకులది భారత్ కావడంతో.. విలియమ్‌లో భారతీయ డీఎన్‌ఏ ఉందని తెలిసింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఎలీజా కెవార్క్.. 1812లో కేథరిన్ స్కాట్ ఫోర్బ్స్‌కు జన్మనిచ్చారు. ఈమె విలియమ్ తల్లి డయానాకు పూర్వికురాలు.

ఎలీజా కెవార్క్ కుటుంబంలో విలియమ్‌ది పదహారో తరం. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో విలియమ్ దంపతుల విందు భేటీ సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలియమ్ దంపతులకు భారతీయ సంస్కృతి, ఇక్కడి వంటకాలపై ఆసక్తి కూడా ఎక్కువే. విలియమ్‌కు కారమంటే పెద్దగా ఆసక్తి లేదని.. కానీ తనకు కారమంటే చాలా ఇష్టమని ఆయన భార్య కేట్ ఇటీవల చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement