breaking news
princes kate
-
విలియమ్ మనోడే!
న్యూఢిల్లీ: బ్రిటన్ యువరాజు విలియమ్‌కు భారతీయ మూలాలున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. విలియమ్ తల్లి ప్రిన్సెస్ డయానా పూర్వీకులది భారత్ కావడంతో.. విలియమ్లో భారతీయ డీఎన్ఏ ఉందని తెలిసింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఎలీజా కెవార్క్.. 1812లో కేథరిన్ స్కాట్ ఫోర్బ్స్‌కు జన్మనిచ్చారు. ఈమె విలియమ్ తల్లి డయానాకు పూర్వికురాలు. ఎలీజా కెవార్క్ కుటుంబంలో విలియమ్ది పదహారో తరం. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో విలియమ్ దంపతుల విందు భేటీ సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలియమ్ దంపతులకు భారతీయ సంస్కృతి, ఇక్కడి వంటకాలపై ఆసక్తి కూడా ఎక్కువే. విలియమ్‌కు కారమంటే పెద్దగా ఆసక్తి లేదని.. కానీ తనకు కారమంటే చాలా ఇష్టమని ఆయన భార్య కేట్ ఇటీవల చెప్పారు. -
భారత్‌లో బ్రిటన్ ప్రిన్స్ జంట
♦ ముంబైలో 26/11 దాడుల మృతులకు విలియమ్, కేట్ నివాళి ♦ సచిన్‌తో కలసి క్రికెట్ ఆడిన విలియమ్ దంపతులు ♦ బాలీవుడ్, కార్పొరేట్ ప్రముఖులతో విందు.. నేడు ఢిల్లీకి పయనం ముంబై: బ్రిటన్ రాకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలో దిగిన అనంతరం నేరుగా తాజ్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. విలియమ్ జంట భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్‌లో నాలుగు రోజుల పర్యటన తర్వాత భూటాన్‌కు వెళ్లనున్నారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటనను వినియోగించుకోవాలని బ్రిటన్ యువరాజు భావిస్తున్నారు. బ్యాట్ పట్టిన యువరాజు దంపతులు విలియమ్ దంపతులు తొలిరోజు ముంబైలో బిజీగా గడిపారు. తాజ్ హోటల్ నుంచి ఓవల్ మైదానానికి చేరుకున్న వీరు అక్కడ సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడి అందరినీ అలరించారు. పలు స్వచ్ఛంద సంస్థల చిన్నారులతోపాటు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలసి క్రికెట్ ఆడారు. సచిన్ మొదటిబంతిని విలియమ్‌కు విసరగా, ఆ తర్వాత ఓ చిన్నారి బంతిని వేసింది. చిన్నారి రెండో బంతికి విలియమ్ ఔట్ కాగా, ఆ తర్వాత రాకుమారి కేట్ బ్యాట్ పట్టారు. సచిన్ అద్భుతమైన క్రికెటర్ అని, బ్యాటింగ్ ఎలా చేయాలో తనకు నేర్పారని విలియమ్ చెప్పారు. వీరితో కలసి ఆడటం మరిచిపోలేనని, ఇది తనకు మధుర స్మృతి అని సచిన్ పేర్కొన్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు బాసటగా నిలుస్తూ తమ ఉదారతను చాటుతున్నారన్నారు. ముంబైకి చెందిన మూడు చారిటీ సంస్థలు మ్యాజిక్ బస్, డోర్‌స్టెప్, ఇండియాస్ చైల్డ్ లైన్ కోసం వారు క్రికెట్ ఆడారు. రాత్రి జరిగిన విందు కార్యక్రమంలో ఈ జంట పలువురు కార్పొరేట్, బాలీవుడ్ ప్రముఖులను కలుసుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన 34 ఏళ్ల కేట్.. అలెంగ్జాడర్ మెక్ క్వీన్ డిజైన్ చేసిన రెడ్ప్రింటెడ్ డ్రెస్‌ను ధరించి ముంబైలో అడుగుపెట్టారు. క్రికెట్ ఆడేటప్పుడు అనిత డోంగ్రే రూపొందించిన ప్రింటెడ్ ట్యూనిక్ డ్రెస్‌లో మెరిశారు. నేడు ఢిల్లీకి... విలియమ్ జంట సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. వీరు అక్కడ అమర సైనికులకు నివాళులర్పించిన అనంతరం, రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. లెక్కలంటే భయం: విలియమ్ విలియమ్ దంపతులు స్వచ్ఛంద సంస్థల చిన్నారులతో సందడిగా గడిపారు. వారితో కలసి క్రికెట్, ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. మీరేం చదువుతున్నారు, మీకు ఏ సబ్జెక్టులంటే ఇష్టం, మీ హాబీలు ఏంటి అని ఆప్యాయంగా పలకరించారు. మీరు కష్టపడి చదివితే మీ కలలను సాకారం చేసుకోవచ్చని 33 ఏళ్ల విలియమ్ చెప్పారు. ఒక చిన్నారి తనకు మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఇష్టమని, తాను టీచర్ కావాలని అనుకుంటున్నానని చెప్పగా, తనకు మాత్రం మ్యాథ్స్ అంటే భయమని విలియమ్ అన్నారు. -
ముంబైలో యువరాణి కేట్ సందడి
-
సచిన్ తో క్రికెట్.. సిక్సర్ కొట్టిన కేట్
ముంబైలో ఆదివారం ఇద్దరు విశిష్ట అతిథులు సందడిచేశారు. ఏడురోజుల భారత్, భుటాన్ పర్యటన నిమిత్తం ముంబై చేరుకున్న బ్రిటన్ యువరాజు విలియమ్స్ చార్లెస్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ లు నగరంలో ఏర్పాటుచేసిన వివిధకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఓవల్ మైదాన్ లో వీధిబాలులతో కలిసి క్రికెట్, ఫుట్ బాల్ ఆడిన కేట్, విలియమ్ లు బాలలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలోమెస్ట్రో సచిన్ టెండూల్కర్, దిలిప్ వెంగ్ సర్కార్ లు కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రత్యేక విమానంలో వచ్చిన యువరాజదంపతులు ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కు వెళ్లారు. హోటల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 26/11 మృతుల స్మారకం వద్ద నివాళులు అర్పించారు. కేట్, విలియమ్ లు బసచేసే సూట్ ను ప్రత్యేకంగా అలకరించినట్లు తాజ్ యాజమాన్యం చెప్పింది. బాలీవుడ్ ప్రముఖులతో ఆదివారం సాయంత్రం భేటీకానున్న కేట్, విలియమ్ లు తర్వాతి రోజు తాజ్ మహల్ ను సందర్శిస్తారు. పలు కార్యక్రమాల అనంతరం భూటాన్ వెళతారు. బ్రిటన్ యువరాజు పర్యటన సందర్భంగా ముంబైలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి