సచిన్ తో క్రికెట్.. సిక్సర్ కొట్టిన కేట్ | princes kate hits sixer while playing cricket with street children in Mumbai | Sakshi
Sakshi News home page

సచిన్ తో క్రికెట్.. సిక్సర్ కొట్టిన కేట్

Apr 10 2016 7:41 PM | Updated on Sep 3 2017 9:38 PM

మెస్ట్రో సచిన్ టెండూల్కర్ తో కలిసి క్రికెట్ ఆడిన యువరాణి కేట్ సిక్సర్ బాది సత్తాచాటుకున్నారు..

ముంబైలో ఆదివారం ఇద్దరు విశిష్ట అతిథులు సందడిచేశారు. ఏడురోజుల భారత్, భుటాన్ పర్యటన నిమిత్తం ముంబై చేరుకున్న బ్రిటన్ యువరాజు విలియమ్స్ చార్లెస్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ లు నగరంలో ఏర్పాటుచేసిన వివిధకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఓవల్ మైదాన్ లో వీధిబాలులతో కలిసి క్రికెట్, ఫుట్ బాల్ ఆడిన కేట్, విలియమ్ లు బాలలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలోమెస్ట్రో సచిన్ టెండూల్కర్, దిలిప్ వెంగ్ సర్కార్ లు కూడా పాల్గొన్నారు.
బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రత్యేక విమానంలో వచ్చిన యువరాజదంపతులు ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కు వెళ్లారు. హోటల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 26/11 మృతుల స్మారకం వద్ద నివాళులు అర్పించారు. కేట్, విలియమ్ లు బసచేసే సూట్ ను ప్రత్యేకంగా అలకరించినట్లు తాజ్ యాజమాన్యం చెప్పింది. బాలీవుడ్ ప్రముఖులతో ఆదివారం సాయంత్రం భేటీకానున్న కేట్, విలియమ్ లు తర్వాతి రోజు తాజ్ మహల్ ను సందర్శిస్తారు. పలు కార్యక్రమాల అనంతరం భూటాన్ వెళతారు. బ్రిటన్ యువరాజు పర్యటన సందర్భంగా ముంబైలో భారీ భద్రత ఏర్పాటుచేశారు.

మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement