పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా | will analysing on defeat in assembly elections | Sakshi
Sakshi News home page

పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా

May 20 2016 4:15 AM | Updated on Mar 29 2019 9:31 PM

పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా - Sakshi

పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా

అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
 
ప్రజల విశ్వాసం చూరగొనేవరకు కష్టపడతాం : రాహుల్
ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొనేవరకు కాంగ్రెస్ కష్టపడి పనిచేస్తుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
 
ఓటమిలో రాహుల్ బాధ్యతలేదు : కాంగ్రెస్
తాజా ఎన్నికల్లో ఓటమికి రాహుల్ గాంధీని బాధ్యుడిని చేయాలన్న ప్రస్తావనలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఒక్కో ఎన్నిక ఫలితాలు ఒక్కో రకంగా ఉంటాయని, వ్యక్తిగతంగా ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ ఎన్నిల్లో ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందా అన్న ప్రశ్నకు ఇప్పుడు అది అప్రస్తుతమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement