బలవంతపు భూసేకరణకు మేం వ్యతిరేకం | We are against to land acquisition law forcefully, says Mekapati rajamohan reddy | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణకు మేం వ్యతిరేకం

May 13 2015 5:38 AM | Updated on Sep 3 2017 1:58 AM

రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో మరోసారి స్పష్టం చేసింది.

భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో మరోసారి స్పష్టం చేసింది. భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుపై మంగళవారం చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తోంది. బహుళ పంటలు సాగయ్యే భూములు, సారవంతమైన భూములను రైతుల ఆమోదం లేకుండా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం.

ఏపీలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు లాక్కోవడం సరికాదు. అక్కడికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో  రాజధానిని నిర్మించవచ్చు. రైతులు మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఈ కారణాల వల్లే మేం ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నాం. ఈసారి కూడా సవరణలు సూచిస్తాం. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..’ అని మేకపాటి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement