ఆ అధికారి నిర్వాకంపై నెటిజన్ల ఫైర్‌..

Video Shows UP Officials SUV Crushing Farmers Vegetables - Sakshi

లక్నో : ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌కు ఓ రైతు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన ప్రభుత్వ అధికారి ఉదంతం ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హపూర్‌ జిల్లాలోని ప్రభుత్వం నిర్వహించే మార్కెట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. అధికారుల అనుమతి లేకుండా రైతు తన కూరగాయలను అమ్ముకుంటున్నాడనే ఆక్రోశంతో అధికారి చేసిన నిర్వాకంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆ రైతు అమ్మకానికి ఉంచిన కూరగాయలపై మార్కెట్‌ కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ తన ఎస్‌యూవీతో పలుమార్లు ముందుకు, రివర్స్‌ తీసుకోవడం మొబైల్‌ ఫోన్‌ వీడియోలో రికార్డయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది సహా ఏ ఒక్కరూ సుశీల్‌ కుమార్‌ ఆగడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ అధికారి తన డ్రైవర్‌ను మందలించి చేతులు దులుపుకున్నారు. ఓ ప్రభుత్వ అధికారి రైతు తీసుకువచ్చిన కూరగాయలను ధ్వంసం చేయడం సరైంది కాదని నెటిజన్లు మండిపడ్డారు. రైతు మార్కెట్‌కు తీసుకువచ్చిన కూరగాయలను వృధా చేశారని ఆ అధికారి తీరును ట్విటర్‌లో జనం తీవ్రంగా ఖండించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top