‘అది చదివితే ఆమె మనసు మారుతుంది’ | Varanasi Priest Sends Ramcharitmanas To Mamata Banerjee | Sakshi
Sakshi News home page

దీదీకి ‘రామ్‌చరిత మానస్‌’ను పంపిన పూజారి

Jun 6 2019 7:09 PM | Updated on Jun 6 2019 7:13 PM

Varanasi Priest Sends Ramcharitmanas To Mamata Banerjee - Sakshi

లక్నో : వారణాసి ఆలయ పూజారి ఒకరు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పవిత్ర రామ్‌చరిత మానస్ గ్రంధాన్ని పంపించారు. దీన్ని పారాయణం చేస్తే మమత మనసు బాగుపడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నాటి నుంచి మమతా బెనర్జీ ‘జై శ్రీ రాం’ నినాదాలు వింటే చాలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. అలాంటి నినాదాలు చేసే వారిని నేరస్థులుగా.. పరాయి దేశం వారిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సదరు పూజారి మాట్లాడుతూ.. ‘జై శ్రీ రాం నినాదాలు వినిపిస్తే చాలు ఆమె ఆగ్రహంతో ఊగి పోతున్నారు. రాముడి పట్ల ఆమె చూపించే ద్వేషమే ఏదో ఓ రోజు ఆమె పతనానికి కూడా కారణమవుతుంది. అందుకే ఆమె మనసు మారాలనే ఉద్దేశంతో రామాయణ గ్రంధాన్ని ఆమెకు పంపించాను. దాన్ని చదివితే ఆమెకు మంచి బుద్ధితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది’ అన్నారు. ‘రామాయణాన్ని చదివి అర్థం చేసుకోవడానికి నేను ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను. అందుకే పుస్తకంతో పాటు నా ఫోన్‌ నంబర్‌ను కూడా పంపించాను’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement