ప్రాణాలు పోయిన 10 రోజులకు తాపీగా.. | Uttar Pradesh Chief Minister Akhilesh Yadav visits Mathura where clashes on June 2 left 24 dead | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోయిన 10 రోజులకు తాపీగా..

Jun 13 2016 1:35 PM | Updated on Sep 4 2017 2:23 AM

ప్రాణాలు పోయిన 10 రోజులకు తాపీగా..

ప్రాణాలు పోయిన 10 రోజులకు తాపీగా..

24 మంది ప్రాణాలు కోల్పోయిన 10 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మథురలో పర్యటించారు.

మథుర: కబ్జాదారులకు, పోలీసులకు మధ్య మథురలో జరిగిన యుద్ధంలో 24 మంది ప్రాణాలు కోల్పోయిన 10 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం మథుర పట్టణంలోని జవహర్ బాగ్ పార్క్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి..  నాడు(జూన్ 2న) చోటుచేసుకున్న భీకర పోరు ఆనవాళ్లను పరిశీలించారు. (చదవండి: రగిలిన మథుర)  మథుర ఘటనపై సీబీఐ విచారణకు నిరాకరించిన అఖిలేశ్ సర్కారు.. రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయిస్తోంది. కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్నదన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు స్వతంత్రంగా సాగలనే డిమాండ్ అన్నివైపుల నుంచి వినిపిస్తోంది. (చదవండి: మథుర అల్లర్ల సూత్రధారి ఖతం అయ్యాడు!)

జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం అలహాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి మథుర ఘటనపై మాట్లాడారు. అఖిలేశ్ వైఫల్యం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, కయిరానా పట్టణంలో హిందూ కుటుంబాల గెంటివేత దారుణమని, వీటిని కూడా సీఎం పట్టించుకోవట్లేదని అన్నారు. (చదవండి:  చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్)ప్రభుత్వానికి చెందిన పార్కు స్థలాన్ని ఖాళీచేయించేందుకు వచ్చిన పోలీసులు, ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కార్యకర్తలు పరస్పరం జరుపుకొన్న దాడుల్లో పోలీసు ఉన్నతాధికారి సహా 24 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: సొంత రాజ్యం... సొంత చట్టాలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement