చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్ | Slain Mathura City SP's wife appointed as OSD in UP Home dept | Sakshi
Sakshi News home page

చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్

Jun 10 2016 1:47 PM | Updated on Sep 4 2017 2:10 AM

చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్

చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్

ఉత్తరప్రదేశ్లోని మథురలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ ముఖుల్ ద్వివేది భార్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత బాధ్యతలు అప్పగించింది.

లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథురలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ ముఖుల్ ద్వివేది భార్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత బాధ్యతలు అప్పగించింది. ఆయన భార్య అయిన అర్చనా ద్వివేదిని సంక్షేమ శాఖకు ఓఎస్డీగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మథురలో చోటుచేసుకున్న ఘర్షణల్లో మొత్తం 29మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే.

ఇలా ప్రాణాలుకోల్పోయినవారిలో ఎస్పీ ముఖుల్ ద్వివేది కూడా ఉన్నారు. విధుల్లో ఉండి ఆయన అకాలంగా ఆయన మరణించడంతో ఈ విషయంపై గురువారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆమెకు ఓఎస్డీగా నియామకం ఖరారు చేస్తూ రాష్ట్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement