breaking news
Mathura clashes
-
ప్రాణాలు పోయిన 10 రోజులకు తాపీగా..
మథుర: కబ్జాదారులకు, పోలీసులకు మధ్య మథురలో జరిగిన యుద్ధంలో 24 మంది ప్రాణాలు కోల్పోయిన 10 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం మథుర పట్టణంలోని జవహర్ బాగ్ పార్క్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి.. నాడు(జూన్ 2న) చోటుచేసుకున్న భీకర పోరు ఆనవాళ్లను పరిశీలించారు. (చదవండి: రగిలిన మథుర) మథుర ఘటనపై సీబీఐ విచారణకు నిరాకరించిన అఖిలేశ్ సర్కారు.. రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయిస్తోంది. కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్నదన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు స్వతంత్రంగా సాగలనే డిమాండ్ అన్నివైపుల నుంచి వినిపిస్తోంది. (చదవండి: మథుర అల్లర్ల సూత్రధారి ఖతం అయ్యాడు!) జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం అలహాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి మథుర ఘటనపై మాట్లాడారు. అఖిలేశ్ వైఫల్యం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, కయిరానా పట్టణంలో హిందూ కుటుంబాల గెంటివేత దారుణమని, వీటిని కూడా సీఎం పట్టించుకోవట్లేదని అన్నారు. (చదవండి: చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్)ప్రభుత్వానికి చెందిన పార్కు స్థలాన్ని ఖాళీచేయించేందుకు వచ్చిన పోలీసులు, ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కార్యకర్తలు పరస్పరం జరుపుకొన్న దాడుల్లో పోలీసు ఉన్నతాధికారి సహా 24 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: సొంత రాజ్యం... సొంత చట్టాలు) -
'మేం రెండేళ్లలో అవినీతిని దూరం చేశాం'
ఢిల్లీ: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. యూపీఏ పదేళ్ల పాలనంతా అవినీతిమయమని విమర్శించారు. మంగళవారం అమిత్షా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్షా స్పష్టం చేశారు.