అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తమ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు.
ఢిల్లీ: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. యూపీఏ పదేళ్ల పాలనంతా అవినీతిమయమని విమర్శించారు.
మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు.