ఏడాదిగా మహిళపై సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారం | UP: CRPF jawan booked for raping 20 year-old-girl for over a year | Sakshi
Sakshi News home page

ఏడాదిగా మహిళపై సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారం

Published Mon, Jul 6 2015 5:11 PM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

ఏడాదిగా మహిళపై సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారం - Sakshi

ఏడాదిగా మహిళపై సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారం

ఇరవై ఏళ్ల యువతిపై ఏడాదిగా ఓ సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బల్లియాలో చోటుచేసుకుంది.

బల్లియా: ఇరవై ఏళ్ల యువతిపై ఏడాదిగా ఓ సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బల్లియాలో చోటుచేసుకుంది. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ములాయం యాదవ్ అనే సీఆర్పీఎఫ్ జవాను తన వదిన తరుపు బంధువుల అమ్మాయి అయిన ఓ 20 ఏళ్ల యువతిని బలవంతంగా లొంగదీసుకున్నాడు.

ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి ఏడాదిగా ఇదే వ్యవహారం కొనసాగించాడు. చివరికి ఆమె ఎప్పుడు తనను పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించడంతో ప్లేటు ఫిరాయించాడు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమెను గెంటివేసే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ములాయం యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement