ఈ-సిగరెట్స్‌పై నిషేధం..

Union Cabinet May Approve Ordinance To Ban E Cigarettes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఎలక్ర్టానిక్‌ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయవచ్చని భావిస్తున్నారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ సిగరెట్లను కలిగిఉంటే ఆరు నెలల వరకూ జైలు శిక్ష రూ 50,000 జరిమానా విధించేలా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. కేంద్ర కేబినెట్‌ భేటీలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top