వివాహ వయసు పెంపు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

Union Budget 2020 Nirmala Sitharaman about women and child - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని  నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు.  మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై కేంద్ర బడ్జెట్  2020 లో రూ .28,600 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. (బడ్జెట్‌ 2020 : డిగ్రీ స్థాయిలోనే ఆన్‌లైన్‌ కోర్సులు)

ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం కోసం ప్రవేశ నమోదులో అబ్బాయిలకన్నా అమ్మాయిల నమోదు ఎక్కువగా ఉందని మంత్రి వెల్లడించారు. బాలికలు ముందు వరుసలో ఉన్నారని, బాలురకన్నా 5 శాతం ఎక్కువ ఉన్నారని తెలిపారు.  అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కోసం భారీ నిధులను కేటాయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాన్ని మంత్రి ప్రతిపాదించారు. దేశంలో మహిళ వివాహం చేసుకోవడానికి కనీన వయస్సును 18 సంవత్సరాలు కాగా ఇప్పుడు ఆ వయస్సును పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. అయితే, దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ టాస్క్‌ఫోర్స్‌ తన నివేదికను అందిస్తుందని వెల్లడించారు. 

  • 6 లక్షల మంది అంగన్‌వాడీలకు  సెల్‌ఫోన్లు 
  • పౌష్టికాహారం,  ఆరోగ్యం ప్రత్యేక శ్రధ్ద
  • 2020-21కి నూట్రిషన్‌ సంబంధిత  కార్యక్రమానికి రూ. 35600 కోట్లు
  •  6 నెలలో  ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

చదవండి : బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top