'నా వీసా రిజెక్ట్ చేశారు.. బాధగా ఉంది' | UK denies visa to Sarod maestro Amjad Ali Khan, day after Shah Rukh Khan’s US embarrassment | Sakshi
Sakshi News home page

'నా వీసా రిజెక్ట్ చేశారు.. బాధగా ఉంది'

Aug 12 2016 7:52 PM | Updated on Sep 4 2017 9:00 AM

'నా వీసా రిజెక్ట్ చేశారు.. బాధగా ఉంది'

'నా వీసా రిజెక్ట్ చేశారు.. బాధగా ఉంది'

నిన్న బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు అమెరికాలో చేదు అనుభవం ఎదురవగా తాజాగా మరో భారతీయ ప్రముఖుడికి అవమానం జరిగింది.

న్యూఢిల్లీ: నిన్న బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు అమెరికాలో చేదు అనుభవం ఎదురవగా తాజాగా మరో భారతీయ ప్రముఖుడికి అవమానం జరిగింది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చేసుకున్న వీసా దరఖాస్తును బ్రిటన్ అధికారులు తిరస్కరించారు. ప్రముఖ సరోద్ సంగీత విధ్వాంసులు అమ్జద్ అలీ ఖాన్ కు ఈ అనుభవం ఎదురైంది. ఆయన సెప్టెంబర్ నెలలో రాయల్ ఫెస్టివల్ హాల్ లో ఓ సంగీత కచేరికి హాజరుకావాల్సి ఉంది. దీనికోసం ఆయన వీసా దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, అనూహ్యంగా దీనిని యూకే అధికారులు రిజెక్ట్‌ చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, లండన్లోని ఇండియన్ హై కమిషన్, ఢిల్లీలోని బ్రిటిష్‌ హై కమిషన్ ను కూడా ఆయన ట్వీట్స్కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. 'దిగ్భ్రాంతి.. దిగులుగా ఉంది.. యూకే వీసా తిరస్కరించారు. సెప్టెంబర్ లో రాయల్ ఫెస్టివల్ హాల్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నా యూకే వీసా తిరస్కరించారు. ప్రేమను, శాంతిని ప్రపంచానికి పంచే ఆర్టిస్టులకు ఇలా జరగడం తీవ్ర విచారం. 1970నుంచి ప్రతి సంవత్సరం యూకేలో ప్రదర్శన ఇస్తున్నాను. ఇప్పుడు నా వీసా దరఖాస్తు రిజెక్ట్ కావడం తీవ్ర నిరాశగా ఉంది' అంటూ ఆయన తన మనోవ్యధను ట్విట్టర్ లో పంచుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement