ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | two militants killed in encounter with security forces in jammu | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Jan 9 2018 1:05 PM | Updated on Aug 25 2018 6:13 PM

two militants killed in encounter with security forces in jammu - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము,కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్‌ జిల్లాలో  మంగళవారం భద్రతదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కోకేర్ నాగ్  లార్నూ అటవీప్రాంతంలో ఉగ్రవాదుల దాక్కున్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్‌ చేపట్టాయి. అయితే భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు.


 

Advertisement
 
Advertisement
Advertisement