టుడే న్యూస్‌ రౌండప్‌.. | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌..

Published Thu, Oct 12 2017 7:04 PM

Today News Rondup

సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  ‘ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి లక్షా 43వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. దాని ఫలితమే నిరుద్యోగుల ఆత్మహత్యలు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. జీవితం చాలా విలువైంది. మంచి రోజులు వస్తాయి.’ అని వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు.

--------------------------------------- రాష్ట్రీయం ------------------------------------------
నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం: వైఎస్‌ జగన్‌
ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా రియల్టర్‌ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్‌
 వైట్‌ కాలర్‌ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్‌ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన దంతులూరి దిలీప్‌కుమార్‌
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేతలు దంతులూరి దిలీప్‌ కుమార్‌తో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో గురువారం వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ ....వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ధర్మవరంలో వైఎస్‌ఆర్‌ సీపీ నేతల అరెస్ట్‌
చేనేతల రుణమాఫీ డిమాండ్‌ చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల అరెస్ట్‌తో ధర్మవరంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.


ఫేక్‌ డాక్టర్‌.. ఫేట్‌ మారిందిలా..!
దొంగ బాబాల మాదిరే నకిలీ డాక్టర్లు కూడా పుట్టుకొస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే.. డబ్బు సంపాదించడం.. వీరి ప్రభావం అమాయక ప్రజల మీద చాలా ఎక్కువ.

---------------------------------------- జాతీయం ------------------------------------------
ముఖ్యమంత్రి కారే దొంగతనం
దేశ రాజధానిలో ఒక కారు చోరీకి గురైంది. దొంగతనానికి గురైంది అషామాషీ కారు కాదండోయ్‌. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కారునే గురువారం దుండగులు దొచుకెళ్లారు.

ఎమ్మెల్యే పేరిట మహిళలకు మెసేజ్‌లు.. అరెస్ట్
సోషల్ మీడియాలో ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేయటం.. సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేయటం... తరచూ చూస్తున్నదే.

నవంబర్‌ 9న హిమాచల్‌లో పోలింగ్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ గురువారం ప్రకటించింది. వచ్చే నెల 9న ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతందని తెలిపింది.

దీపావళికి ఏదైనా జరిగిందో.. పోలీసులకు యోగి వార్నింగ్
తమ రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నడుంకట్టారు. ఇందుకోసం పోలీసులకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

షాకింగ్‌ తీర్పు.. మరి ఆరుషిని చంపిందెవరు?
ఆరుషి హత్య కేసులో అనూహ్య మలుపు.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులతో కింది స్థాయి కోర్టులో దోషులుగా పేర్కొన్న ఆమె తల్లిదండ్రులను గురువారం అలహాబాద్‌ కోర్టు ఎవరూ ఊహించని విధంగా నిర్దోషులుగా ప్రకటించింది.

భారత్‌ను ఉత్తర కొరియా కూడా దాటేసింది..
ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని చెప్పుకుంటున్నా దారిద్ర్యం మాత్రం భారత్‌ ప్రతిష్టను ప్రతిసారి మసకబారుస్తూనే ఉంది.

అమిత్‌ షా కొడుకు 'అవినీతి'.. ఆరెస్సెస్‌ వైఖరి ఇదే!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ షాపై అవినీతి ఆరోపణలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

మోదీ ఇమేజ్‌ గట్టెక్కిస్తుందా..?
చుట్టూ చీకటి..దారంతా ముళ్లు..అయినా ఆశలన్నీ ఆ నేతపైనే..భారమంతా అధినేత భుజాలపైనే. ముంచుకొచ్చిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, అటు తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే మోదీ బ్రాండ్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది.

---------------------------------------- అంతర్జాతీయం ----------------------------------------
 ఇమ్రాన్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌
పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ ఛైర్మన్‌, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టు ధిక్కరణ నేరం కింద పాక్‌ ఎన్నికల కమిషన్‌ గురువారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది.

మంచు కప్పేసిన ప్రేమ
ఎన్నో పర్వతాలను అధిరోహించి తన పేరును చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సుప్రసిద్ధ పర్వతారోహకుడు హేడెన్‌ కెన్నడీ(27) బలవన్మరణానికి పాల్పడ్డారు.

మీరు జోక్యం చేసుకోవద్దు
చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను భారత్‌ దృష్టికోణం నుంచి చూడొద్దని అమెరికాను పాకిస్తాన్‌ అభ్యర్థించింది. సీపీఈసీ ప్రాజెక్ట్‌ కేవలం ఆర్థికాభివృద్ధి, మెరుగైన రవాణా సేవలకు ఉద్దేశించినదని పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి ఇశాన్‌ ఇక్బాల్‌ అమెరికాకు వెల్లడించారు.

---------------------------------------- బిజినెస్‌ ------------------------------------------
మెగా డీల్‌: టెలికాం దిగ్గజం చేతికి టాటా టెలి
మరికొన్ని రోజుల్లో మూత పడబోతున్న టాటా టెలిసర్వీసుల వైర్‌లెస్‌ వ్యాపారాలను ఎవరు కొనబోతున్నారు? నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఎవరి చేతిలోకి వెళ్లబోతుంది? అంటే టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ వీటిని సొంతం చేసుకోబోతుందని తెలిసింది.

మళ్లీ డిస్కౌంట్ల పండుగ: ఒకేసారి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌
మళ్లీ డిస్కౌంట్ల ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ రెండూ ఒకేసారి తన సేల్‌ ఆఫర్లకు తెరతీయబోతున్నాయి.


---------------------------------------- సినిమా ------------------------------------------
బిజీ అవుతోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ షాలిని పాండే. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది.

రూపాయి కూడా ముందు తీసుకోను : ఆమిర్
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆమిర్ ఖాన్ దంగల్ రికార్డ్ సృష్టించింది.

---------------------------------------- క్రీడలు ------------------------------------------
అదే నా ఆఖరి మ్యాచ్‌: నెహ్రా
టీమిం​డియా వెటరన్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. నవంబర్‌ 1న సొంత మైదానమైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో న్యూజ్‌ల్యాండ్‌ తో జరిగే మ్యాచ్ తన ఆఖరి మ్యాచ్‌ అని చెప్పారు.

టాప్ ర్యాంకుపై ఆసక్తికర పోరు!
ఇటీవల ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ర్యాంకింగ్స్ లో కూడా టాప్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement