అదే నా ఆఖరి మ్యాచ్‌: నెహ్రా

 Ashish Nehra announces retirement from all forms of cricket

సాక్షి, స్పోర్ట్స్‌: టీమిం​డియా వెటరన్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. నవంబర్‌ 1న సొంత మైదానమైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో న్యూజ్‌ల్యాండ్‌ తో జరిగే మ్యాచ్ తన ఆఖరి మ్యాచ్‌ అని చెప్పారు. రిటైర్మెంట్ అనేది తన వ్యక్తిగత నిర్ణయం అని వెల్లడించారు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్ లో భారత్‌కు ఆడటం గర్వంగా ఉందన్నారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్ కోహ్లీతో చర్చించినట్టు తెలిపారు. భారత బౌలింగ్ భువనేశ్వర్, బుమ్రాతో సమతూకంగా ఉందన్నారు. ఇంకా రెండేళ్లు ఆడమని సహచరులు కోరినట్లు వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లోనూ నెహ్రా ఆడకపోవచ్చు. 

1999 లో మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top