రూపాయి కూడా ముందు తీసుకోను : ఆమిర్

Aamir Khan says about How he Paid for his films

భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆమిర్ ఖాన్ దంగల్ రికార్డ్ సృష్టించింది. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికీ పలు దేశాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ఆమిర్ రెమ్యూనరేషన్ గా ఎంత డిమాండ్ చేస్తాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే తన రెమ్యూనరేషన్ కు సంబంధించి ఆమిర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తను హీరోగా నటిస్తున్నందుకు చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అడ్వాన్స్ ఆమిర్ తీసుకోడట. కేవలం సినిమాల లాభాల్లో వాటా తీసుకునేట్టుగా తన సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు ఆమిర్. అందుకే తన సినిమాల్లో ఆఖరున పారితోషికం అందుకునేది నేనే అంటూ కామెంట్ చేశాడు. ' పాత పద్దతులనే పాటిస్తున్నాను. నేను ఓ కళను ప్రదర్శిస్తున్నా.. ప్రేక్షకులకు నచ్చితే డబ్బులిస్తారు. లేదంటే నాకు రూపాయి కూడా రాదు. అయితే అదృష్టం కొద్ది నా సినిమాలన్నీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయన్నా'రు. అంతేకాదు అన్ని ఖర్చులు, అందరి పారితోషికాలు ఇచ్చేసిన తరువాత మిగిలిన దాంట్లోనే తాను వాటా తీసుకుంటానని తెలిపాడు ఆమిర్.

అయితే ఆమిర్ ఖాన్ చిత్రాలన్ని భారీ లాభాలు సాధిస్తుండటంతో భారీ మొత్తాన్నే వాటాగా అందుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్. తన సినిమాల లాభాల్లో 60 నుంచి 70 శాతం వరకు తన పారితోషికంగా అందుకుంటున్నాడు ఆమిర్. ఈ లెక్కన దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో ఆ సినిమా లాభాల్లో వాటాగా ఏకంగా 300 కోట్లకు పైగా ఆమిర్ అందుకున్నాడట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top