సాక్షి, అనంతపురం : చేనేతల రుణమాఫీ డిమాండ్ చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్‌తో ధర్మవరంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం పట్టణంలో అధికారులు చేనేత సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలు సదస్సు వేదిక వద్దకు చేరుకుని రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం..ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై అధికారులను నిలదీశారు. చేనేత కార్మికుల పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. చేనేత సదస్సును అడ్డుకోవటంతో వైఎస్‌ఆర్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేస్వామి సహా పలువురు చేనేత కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
ధర్మవరంలో వైఎస్‌ఆర్ సీపీ నేతల అరెస్ట్
Oct 12 2017 2:48 PM | Updated on May 29 2018 2:26 PM
Advertisement


