సీపీఈసీ ప్రాజెక్ట్‌ : భారత్‌ అభ్యంతరాలు మీకెందుకు? | Don’t look at CPEC from Indian side | Sakshi
Sakshi News home page

మీరు జోక్యం చేసుకోవద్దు

Oct 12 2017 2:51 PM | Updated on Apr 4 2019 3:25 PM

Don’t look at CPEC from Indian side - Sakshi

వాషింగ్టన్‌ : చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను భారత్‌ దృష్టికోణం నుంచి చూడొద్దని అమెరికాను పాకిస్తాన్‌ అభ్యర్థించింది. సీపీఈసీ ప్రాజెక్ట్‌ కేవలం ఆర్థికాభివృద్ధి, మెరుగైన రవాణా సేవలకు ఉద్దేశించినదని పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి ఇశాన్‌ ఇక్బాల్‌ అమెరికాకు వెల్లడించారు. వివాదాస్పద ప్రాంతంలో సీపీఈసీ ప్రాజెక్ట్‌ చేపట్టడంపై గత వారం అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్‌ స్పందనపై ఆయన మాట్లాడారు. జేమ్స్‌ మాటిస్‌.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సీపీఈసీ ప్రాజెక్ట్‌ వెనుకు ఎటువంటి దురుద్దేశాలు, కుట్రలు లేవని ఇక్బాల్‌ అమెరికాకు తెలిపారు. పాకిస్తాన్‌ ఆర్థికాభివృద్దిలో భాగంగానే నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్‌ వల్ల మౌలిక వసతుల కల్పన, ఇం‍ధన రంగాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను భారత దృష్టికోణం నుంచి కాకుండా.. పాకిస్తాన్‌ అభివృద్ధి కోణంలోనే చూడాలని ఇక్బాల్‌ అమెరికాను కోరారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌ విషయంలో భారత్‌ వైపే అమెరికా నిలిస్తే.. పాక్‌-అమెరికా దౌత్యసంబంధాలు ప్రభావం పడుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement