వైఎస్‌ఆర్‌ సీపీలోకి దంతులూరి దిలీప్‌ కుమార్‌ | Anakapalli Congress leader Danthuluri Dilip Kumar joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన దంతులూరి దిలీప్‌కుమార్‌

Oct 12 2017 5:28 PM | Updated on Feb 18 2025 11:15 AM

Anakapalli Congress leader Danthuluri Dilip Kumar joins ysr congress party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేతలు దంతులూరి దిలీప్‌ కుమార్‌తో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో గురువారం వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ ....వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ..జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అలాగే సీనియర్ నేత చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలపడిందని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మరోవైపు అమరావతి మాజీ ఎంపీపీ వెంపా జ్వాలాలక్ష్మి నరసింహారావు కూడా ఇవాళ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement