Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top 10 Telugu Latest News Moring Headlines Today 27th April 2022 - Sakshi

1. ట్విటర్‌ డీల్‌తో టెస్లాకు భారీ దెబ్బ

ట్విటర్‌ను ఎలన్‌ మస్క్‌ కొనుగోలు చేయడం తెలిసిందే. అయితే ఆయన సీఈవోగా ఉన్న టెస్లాకు ఈ ప్రభావంతో భారీ దెబ్బ పడింది. 

2. మూడు వేలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. 

3. పుతిన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదే పదే అణ్వాయుధం అనే పదం వాడుతుండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే తిట్టిపోశాడు.

4.ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్‌ పరాగ్‌..

రియాన్‌ పరాగ్‌ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు నాలుగు క్యాచ్‌లు తీసుకున్న మూడో ప్లేయర్‌గా పరాగ్‌ నిలిచాడు‌. గతంలో కలిస్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌; డెక్కన్‌ చార్జర్స్‌పై 2011లో), గిల్‌క్రిస్ట్‌ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌; చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 2012లో) ఈ ఘనత సాధించారు.

5. చైనాలో మరో వైరస్‌.. ప్రపంచంలోనే ఫస్ట్‌ కేసు

కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్‌ కంట్రీ చైనాను మరో వైరస్‌ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్‌ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. 

6. ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్‌ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

7. నిర్మాతతో పెళ్లి, వ్యభిచారం ఒత్తిడితో నటి ఆత్మహత్యాయత్నం

గుడిలో నిర్మాతతో పెళ్లి చేసుకున్న కోలీవుడ్‌ సీరియల్‌ నటి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి తేవడంతో నటి ఆత్మహత్యాయత్నం

8. తమిళనాడు తంజావూరులో పెనువిషాదం 

తంజావూరు రథయాత్రలో మంగళవారం అర్ధరాత్రి దాటాక అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్రకు కరెంట్‌ వైర్లు తగలడంతో.. కరెంట్‌ షాక్‌తో మంటలు చెలరేగి పది మందికిపైగా భక్తుల దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

9. తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?

వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్‌ ఫుడ్‌  తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి తాటి ముంజల గురించి ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

10. ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌

పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలను ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) ఆహ్వానించింది. కానీ, అవి పాల్గొనమని చెప్పేశాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top