భారత్‌ను ఉత్తర కొరియా కూడా దాటేసింది..

India Fares Worse Than North Korea, Bangladesh and Sri Lanka on Global Hunger Index

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని చెప్పుకుంటున్నా దారిద్ర్యం మాత్రం భారత్‌ ప్రతిష్టను ప్రతిసారి మసకబారుస్తూనే ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్‌ 100వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకు ప్రకారం భారత్‌ ఉత్తర కొరియా, శ్రీలంక, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉంది. గురువారం అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఈ మేరకు ప్రపంచ ఆకలి సూచి పట్టికను ప్రకటించింది.

ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువగా పోషకాహారం లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా ఆ నివేదిక పేర్కొంది. 21శాతం ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికహారలోపంతో బాధపడుతుండటంతోపాటు సరైన బరువు కూడా లేరని వెల్లడించింది. గతంలో 2016లో 118 దేశాల్లో భారత్‌ది 97 ర్యాంకుకాగా, ఈ ఏడాది మాత్రం శ్రీలంక, బంగ్లాదేశ్‌లు భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి. ఇక ఉత్తర కొరియా కూడా గత ఏడాది కూడా భారత్‌కంటే కింద ఉండి ఈ ఏడాది మాత్రం ఏకంగా 93 ర్యాంకుకు దూసుకెళ్లింది. కాగా, గతంలో మాదిరిగా పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌లు మాత్రం భారత్‌ వెనుకే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 31.4గా ఉంది. ఈ స్కోర్‌ 28.5కి చేరితే మాత్రం అత్యంత ఆందోళనకరమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top