గోదావరి జలాలు సద్వినియోగమయ్యేలా చూడండి | to use godavari basin water to state | Sakshi
Sakshi News home page

గోదావరి జలాలు సద్వినియోగమయ్యేలా చూడండి

Nov 21 2014 10:44 PM | Updated on Nov 9 2018 5:52 PM

గోదావరి బేసిన్‌కు చెందిన 150 టీఎంసీలకు పైగా నీటిని రాష్ట్ర ప్రభుత్వం....

ముంబై: గోదావరి బేసిన్‌కు చెందిన 150 టీఎంసీలకు పైగా నీటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోతోందని రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అభిప్రాయపడ్డారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ జలాల సద్వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. లేకపోతే రైతాంగం ఇక్కట్లపాలవుతారన్నారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆర్థిక శాఖమంత్రి సుధీర్ మునగంటివార్, ఉన్నత విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ విష్ణు సర్వలతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వయంప్రయంపత్తి బోర్డులు, గిరిజన సంక్షేమం, ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛ్ భారత్ అభియాన్ తదితర అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement