వైరల్‌ : క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్‌

Three Storey Building Falls Into Canal In West Bengal - Sakshi

కోల్‌కతా : అప్పటి వరకు దృఢంగా కనిపించిన ఆ మూడు అంతస్తుల భవనం క్షణాల్లో కనిపించకుండా పోయింది. రెప్పపాటు కాలంలో కుప్పకూలింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువకు సమీపంలో నిర్మించడం వల్లే భనవం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. భవనం​ నిర్మాణ దశలో ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా నిశ్చితంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇటీవల వర్షాలు పోటెత్తడంతో కాలువలో పూడిక ఏర్పడింది. దాన్ని శుభ్రం చేస్తుంగా పక్కనే ఉన్న భవనం పునాది కదిలిపోయి ఒక్కసారిగా కుప్పకూలి కాలువలో పడిపోయింది. నిర్మాణ దశలో ఉండగానే కూలిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.నిజానికి ఈ భవనానికి కొన్ని రోజుల కిందలే పగుళ్లు ఏర్పాడ్డాయని, చెప్పినా పట్టించోలేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై భవనం యజమాని స్పందించనప్పటికీ అధికారులు మాత్రం విచారణ ప్రారంభించారు. కాగా, క్షణాల్లో కుప్పకూలిన భవనం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top