పెండింగు కేసులు మూడు కోట్లు | Three crore cases pending | Sakshi
Sakshi News home page

పెండింగు కేసులు మూడు కోట్లు

Dec 8 2014 2:18 AM | Updated on Aug 28 2018 7:15 PM

దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న మూడు కోట్ల కేసులను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు

పరిష్కరించాలని హైకోర్టులకు సీజేఐ లేఖ

ఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో  పెండింగులో ఉన్న మూడు కోట్ల కేసులను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు హైకోర్టులకు లేఖలు రాశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉన్నతాధికారి ఒకరు వివరాలు వెల్లడిస్తూ కిందిస్థాయి కోర్టుల్లో అయిదేళ్లు అంతకుమించిన కాలంగా పరిష్కారం కాకుండా పలు కేసులు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. 

ఇరవై నాలుగు హైకోర్టుల్లో 44.5 లక్షల కేసులు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఇక కింది స్థాయి కోర్టుల్లో 2.6 కోట్ల కేసులు పెండింగులో పడ్డాయన్నారు. అత్యధికంగా అలహాబాద్ హైకోర్టులో పదివేలకు పైగా అపరిష్కృత కేసులుండగా సిక్కింలో  అత్యల్పంగా 123 కేసులున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం సీజే ఇలాంటి కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచిని ఏర్పాటు ప్రతిపాదన తెచ్చినట్లు ఆ అధికారి పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement