సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల విరాళం | tamil nadu Chief Minister J. Jayalalithaa donated rs. 10 crores for cinema festivals | Sakshi
Sakshi News home page

సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల విరాళం

Sep 18 2013 9:04 PM | Updated on Aug 11 2018 8:27 PM

వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వ చేయూతనిచ్చింది.

చెన్నై:వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వ చేయూతనిచ్చింది. త్వరలో జరుగనున్న సినిమా వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ నెల 21 నుంచి భారతీయ సినిమా శత జయంతి వేడుకలు చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  శత జయంతి వేడుకల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం విశేషం. ఈ మేరకు దక్షిణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కల్యాణ్ కు రూ.10 కోట్ల చెక్కును జయలలిత అందజేశారు.

 

భారతీయ సినీ చరిత్రలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తమిళులు విరాళాన్ని ప్రకటించడంలో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement