రైల్వే కోచ్‌లపై స్వచ్ఛభారత్‌ లోగో | The Swarnabharat logo on railway coaches | Sakshi
Sakshi News home page

రైల్వే కోచ్‌లపై స్వచ్ఛభారత్‌ లోగో

Aug 27 2018 3:58 AM | Updated on Oct 8 2018 7:53 PM

The Swarnabharat logo on railway coaches - Sakshi

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహా త్ముడిని స్మరిస్తూ అన్ని రైలు కోచ్‌లపై స్వచ్ఛభారత్‌ లోగోతో పాటు జాతీయ జెండాను ముద్రించనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. దీనికి సంబంధించి ‘స్వచ్ఛతా పక్వారా’పేరుతో సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 2 వరకు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీని కోసం మహాత్మునితో ప్రత్యేక అను బంధం ఉన్న ప్రాంతాల్లోని 43 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement