'నలంద' వేడుకల్లో సుష్మా స్వరాజ్ | Sushma Swaraj inaugurates Nalanda University | Sakshi
Sakshi News home page

'నలంద' వేడుకల్లో సుష్మా స్వరాజ్

Sep 19 2014 2:29 PM | Updated on Sep 2 2017 1:39 PM

ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం పున ప్రారంభ వేడుకల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.

పాట్నా:  ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం పున ప్రారంభ వేడుకల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.  ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. నలంద విశ్వవిద్యాలయం బీహార్‌లోని రాజ్‌గిర్‌ ప్రాంతంలో 455 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ప్రాంగణంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి  ప్రారంభమైన విషయం తెలిసిందే. 

విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులతో పాటు ఆరుగురు అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. కాగా 2020 నాటికి విశ్వవిద్యాలయం పూర్తిగా కొత్తరూపు సంతరించుకోనుంది.

బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజీ, బీజేపీ నేత, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నలందా విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభం అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు మాత్రం ఆహ్వానం అందలేదు. నితీశ్కు ఆహ్వానం పంపలేదని  విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement