త్వరలో ‘అమ్మ’ థియేటర్లు | Soon the 'mother' theaters | Sakshi
Sakshi News home page

త్వరలో ‘అమ్మ’ థియేటర్లు

Aug 8 2014 2:45 AM | Updated on Sep 2 2017 11:32 AM

నిరు పేదలకు సినిమా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ‘అమ్మ థియేటర్లు’ ఈ ఏడాది డిసెంబరులోగా చెన్నై వాసులకు కనువిందు చేయనున్నాయి.

చెన్నై: నిరు పేదలకు సినిమా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ‘అమ్మ థియేటర్లు’ ఈ ఏడాది డిసెంబరులోగా చెన్నై వాసులకు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో చెన్నై కార్పొరేషన్ పరిధిలో 15 అమ్మ థియేటర్లను నిర్మించనున్నారు. రూ.25 లోపు ధరకే ఏసీ, డిజిటల్ టెక్నాలజీతో కూడిన థియేటర్లను నిర్మించనున్నామని, త్వరలో టెండర్లు పిలిచి డిసెంబరులోగా ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నట్లు మేయర్ సైదై దొరస్వామి గురువారం తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement