మోదీ నివాసానికి వెళ్లిన సోనియా, మన్మోహన్ | sonia, mannohan went to modi residence | Sakshi
Sakshi News home page

మోదీ నివాసానికి వెళ్లిన సోనియా, మన్మోహన్

Nov 27 2015 7:59 PM | Updated on Oct 22 2018 9:16 PM

మోదీ నివాసానికి వెళ్లిన సోనియా, మన్మోహన్ - Sakshi

మోదీ నివాసానికి వెళ్లిన సోనియా, మన్మోహన్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు.

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కీలకమైన జీఎస్టీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆహ్వానించారు.
 

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. జీఎస్టీ బిల్లుతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని చర్చించారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన అధికార నివాసానికి సోనియా వెళ్లడం ఇదే తొలిసారి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement