సోనియా 'ప్రధాని' విందుకు రాహుల్ డుమ్మా! | Sonia Gandhi hosts farewell dinner for PM Manmohan Singh, Rahul Gandhi skips it | Sakshi
Sakshi News home page

సోనియా 'ప్రధాని' విందుకు రాహుల్ డుమ్మా!

May 14 2014 10:43 PM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా 'ప్రధాని' విందుకు రాహుల్ డుమ్మా! - Sakshi

సోనియా 'ప్రధాని' విందుకు రాహుల్ డుమ్మా!

ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్ధం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందుకు యువనేత రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్ధం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందుకు యువనేత రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోనియా అధికార నివాసం 10 జన్ పథ్ లో ఏర్పాటు చేసిన విందులో దశాబ్దకాలం పాటు  యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాని పదవిని నిర్వహించిన మన్మోహన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
 
సోనియా ఏర్పాటు చేసిన విందుకు మన్మోహన్, ఆయన సతీమణి గురుచరణ్ కౌర్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్ కు కాంగ్రెస్ నేతలు, కేంద్ర మంత్రులు మెమెంటోను అందచేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా రాసిన వీడ్కోలు సందేశాన్ని కేంద్ర మంత్రి పల్లం రాజు చదివి వినిపించారు.
 
ఈ విందులో ప్రధాని దంపతులు, సోనియాతో పోటోలు దిగడానికి నేతలు పోటీ పడ్డారు. అయితే రాహుల్ ఈ విందుకు హాజరుకాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాను విందుకు అందుబాటులో ఉండటం లేదని.. శనివారమే ప్రధాని మన్మోహన్ ను రాహుల్ మర్యాద పూర్వకంగా కలిసి చెప్పినట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement