చనిపోయి వచ్చిన జవానుకు మళ్లీ అదే కోరిక | Soldier who returned from dead wants to rejoin Army | Sakshi
Sakshi News home page

చనిపోయి వచ్చిన జవానుకు మళ్లీ అదే కోరిక

Jun 17 2016 1:17 PM | Updated on Sep 4 2017 2:44 AM

తనకు మరోసారి మాతృదేశానికి సేవలు అందించాలని ఉందని ధరమ్ వీర్ సింగ్ అన్నారు. గత పరిస్థితులు ఎలా ఉన్నా తనకు ఆర్మీలో చేరడమే ఇష్టమని ఆయన చెప్పారు.

డెహ్రాడూన్: తనకు మరోసారి మాతృదేశానికి సేవలు అందించాలని ఉందని ధరమ్ వీర్ సింగ్ అన్నారు. గత పరిస్థితులు ఎలా ఉన్నా తనకు ఆర్మీలో చేరడమే ఇష్టమని ఆయన చెప్పారు. భారత సైన్యంలో పనిచేస్తున్న ధరమ్ 2009లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో మూడేళ్ల తర్వాత అతడు చనిపోయినట్లు ఆర్మీ కూడా కుటుంబానికి ధ్రువపత్రం ఇచ్చి పెన్షన్ కూడా మంజూరు చేసింది.

అయితే, అందరు అవాక్కయ్యేలా ధరమ్ వీర్ ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రాణాలతో తన ఇళ్లు చేరాడు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రమాద వివరాల గురించి ప్రశ్నించగా 'అది 2009, నవంబర్ 27. సరిగ్గా రాత్రి 11.30గంటల ప్రాంతంలో చక్రతా రోడ్డులో ఉన్నాం. ఓ కారు ఢీ ప్రమాదం నుంచి తప్పించే క్రమంలో నేను నడుపుతున్న వాహనం తీవ్ర ప్రమాదానికి గురైంది. ఢీవైడర్ ను ఢీకొట్టింది. నేను తీవ్రంగా గాయపడ్డానని మాత్రం గుర్తుంది. ఆ తర్వాత నేను హరిద్వార్లోకి ఎలా వెళ్లానో తెలియదు. ఒక బైక్ ప్రమాదం ద్వారా మాత్రం తిరిగి నాకు జ్ఞాపకశక్తి వచ్చింది. ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే భారత ఆర్మీలోకి వెళ్లి నా సేవలు అందించాలని అనుకుంటున్నాను' అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement