కమెడియన్‌పై మండిపడిన శివసేన | shivsena calls kapil sharma outsider over bmc bribe row | Sakshi
Sakshi News home page

కమెడియన్‌పై మండిపడిన శివసేన

Sep 9 2016 6:50 PM | Updated on Sep 4 2017 12:49 PM

కమెడియన్‌పై మండిపడిన శివసేన

కమెడియన్‌పై మండిపడిన శివసేన

బీఎంసీ అధికారులు తన నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద గొడవ చేసిన కమెడియన్ కపిల్ శర్మపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది.

బీఎంసీ అధికారులు తన నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద గొడవ చేసిన కమెడియన్ కపిల్ శర్మపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. బయటి నుంచి వచ్చి ముంబై పరువు గంగలో కలుపుతున్నాడని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. కపిల్ శర్మ స్వస్థలం పంజాబ్ అన్న విషయం తెలిసిందే. ముందుగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను కపిల్ చదువుతున్నాడని రౌత్ అన్నారు.

కపిల్ శర్మను లంచం అడిగింది ఎవరో చెప్పాల్సిందిగా తాము కోరినా.. ఆయన మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదని బీఎంసీ విజిలెన్స్ శాఖ చీఫ్ ఇంజనీర్ మనోహర్ పవార్ అన్నారు. ఆయన చెబితే తాము వెంటనే విచారణ ప్రారంభించి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వీలుంటుందని చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement