
పోలీస్ స్టిక్కర్ ఉన్న ఓ ఎస్‌యూవీ వాహనం ఎంపీ అభ్యర్థి ప్రయాణిస్తున్న కారును అతివేగంతో వచ్చి ఢీకొట్టింది.
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో బొన్‌గోన్ నియోజక వర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి శాంతాను ఠాకూర్ ప్రయాణిస్తున్న కారును ఓ ఎస్‌యూవీ కారు ఢీకొట్టింది. జగూలియా సమీపంలో జరిగిన ఈ ఘటనలో శాంతాను ఠాకూర్‌తో పాటూ మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పోలీస్ స్టిక్కర్ ఉన్న ఓ ఎస్‌యూవీ వాహనం శాంతాను ఠాకూర్ ప్రయాణిస్తున్న కారును అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఎస్‌యూవీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో బొన్‌గోన్ నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్దమొత్తంలో శాంతాను ఠాకూర్ అనుచరులు గైగటా పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు.