మహారాష్ట్రలో కిల్లర్ డాక్టర్ | 'serial killer' doctor Santosh Pol confesses to six murders, say cops | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో కిల్లర్ డాక్టర్

Aug 17 2016 1:30 AM | Updated on Aug 21 2018 7:17 PM

మహారాష్ట్రలో కిల్లర్ డాక్టర్ - Sakshi

మహారాష్ట్రలో కిల్లర్ డాక్టర్

వైద్యం చేసి ప్రాణాలు పోయాల్సిన ఓ డాక్టర్ అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేశాడు. అందులో ఐదుగురిని తన ఫాంహౌస్‌లోనే...

ఆరు హత్యలు చేశానని పోలీస్ కస్టడీలో ఒప్పుకున్న సంతోష్
పుణే:  వైద్యం చేసి ప్రాణాలు పోయాల్సిన ఓ డాక్టర్ అతి కిరాతకంగా  ఆరుగురిని  హత్య చేశాడు. అందులో ఐదుగురిని తన ఫాంహౌస్‌లోనే పూడ్చిపెట్టాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ సీరియల్ కిల్లర్ ఉదంతంతో మహారాష్ట్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సతారా జిల్లాకు చెందిన 42 ఏళ్ల డాక్టర్ సంతోష్ పాల్ అలియాస్ ‘డాక్టర్ డెత్’. ఈయన గత కొన్నేళ్లలో (2003-2016 మధ్యకాలంలో) తన చీకటి ప్రపంచానికి, నేరాలకు అడ్డువచ్చిన ప్రతి ఒక్కరికీ అధిక మోతాదులో మెడిసిన్స్ ఇవ్వడం... ఆపై మృతదేహాలను తన ఫార్మ్‌హౌస్‌లోనే పూడ్చిపెట్టడం చేసేవాడు. ఇలా  ఏకంగా ఆరుగురిని తన అకృత్యాలకు బలిచేశాడు.

ఈ ఆరు హత్యల్లో నలుగురు బాధితుల మృతదేహాలను సోమవారం అర్ధరాత్రి నిందితుడి ఫాంహౌస్‌లో పోలీసులు వెలికితీశారు. ఒక అంగన్‌వాడీ వర్కర్ అపహరణ, హత్యతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో  సంతోష్‌ను ఈ నెల 11న అరెస్ట్ చేసి, విచారించగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ సందీప్ పాటిల్ తెలిపారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడు డాక్టర్ సంతోష్ ఆరు హత్యలను తానే చేసినట్లు ఒప్పుకున్నాడని  తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.,. మహారాష్ట్ర పూర్వ ప్రాథమిక్ శిక్షణ సేవికా సంఘ్ అధ్యక్షురాలైన జెద్దెను జూన్ 16న సంతోష్ చంపాడు.

అక్రమ సంబంధంతో పాటు, నగదు, నగలపై దురాశతోనే సంతోష్ ఈ హత్యలకు పాల్పడ్డాడు.   సంతోష్‌కు జ్యోతి మండ్రే అనే నర్స్‌తో అక్రమ సంబంధం ఉండేది. జెద్దె ఆ సంగతి బయట పెడుతుందని ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. వీరిద్దరూ జెద్దెకు అధిక మోతాదులో మెడిసిన్‌ను ఇచ్చి హతమార్చి, డాక్టర్ ఫార్మ్‌హౌస్‌లోనే పూడ్చిపెట్టారు. జ్యోతి ఈ నేరాన్ని అంగీకరించింది. తర్వాత సంతోష్‌నూ అరెస్ట్ చేసి విచారిస్తే మిగిలిన హత్యలు వెలుగు చూశాయి. జెద్దెతో పాటు హత్యకు గురైన వారిలో సల్మా షేక్, జగబాయ్ పాల్, సురేఖ, వణిత గైక్వాడ్, నత్మాల్ ఉన్నారు. వీరందరిలో ఒక్క గైక్వాడ్ మృతదేహాన్ని తప్ప మిగిలిన వారి మృతదేహాలను ఫాంహౌస్‌లో కనుగొన్నారు. సంతోష్ 2008లో గైక్వాడ్‌ను చంపి మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement