breaking news
Six murders
-
రంగారెడ్డి షాబాద్‌లో కిరాతకం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య
సాక్షి, షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయి. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో ఓ వ్యక్తి మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉండటం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌పై ఓ బాలికను(17) వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం అతడు బెయిల్‌పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున.. సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత (30), మూడేళ్ల కుమార్తె పరీక్షిత్, రెండేళ్ల కుమారుడు రుద్రవాన్స్లను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి.. బాధితురాలి తల్లి చిట్యాల లక్ష్మి, నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను అదే కత్తితో కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఎత్తుకెళ్లి ఊరి శివారులో అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం గ్రామాన్ని భయాందోళనలకు గురిచేసింది.ప్రాథమిక విచారణలో పోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలికను రాజ్‌కుమార్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన సామూహిక హత్యల ఘటనల్లో ఇదొకటిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేరోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో.. నిందితుడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక్షసుడు రాజ్‌కుమార్ తన కుటుంబాన్నిఎందుకు కడతేర్చాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆటో లారీ ఢీ
పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు – పీలేరు జాతీయ రహదారిలోని అయ్యావాండ్లపల్లె బస్ స్టాప్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు వైపు వెళుతున్న లారీ కల్లూరువైపు వస్తున్న ప్యాసింజరు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పీలేరు మోడల్ కాలనీకి చెందిన గురప్ప(55), రేవతి(40), ఇందిరమ్మ కాలనీకి చెందిన సరస్వతి(47), సుభా కాంక్షిణి(22), మనోహర్ (6నెలలు), ఎగువపోకలవారి పల్లెకు చెందిన హంసవేణి(27) ఉన్నారు. కల్లూరు ఎస్ఐ విశ్వనాథ నాయుడు క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయాకు తీసుకెళ్లారు. కాగా ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్లిపోయిన లారీ డ్రైవర్‌ను పీలేరు సమీపంలో అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. -
మహారాష్ట్రలో కిల్లర్ డాక్టర్
ఆరు హత్యలు చేశానని పోలీస్ కస్టడీలో ఒప్పుకున్న సంతోష్ పుణే: వైద్యం చేసి ప్రాణాలు పోయాల్సిన ఓ డాక్టర్ అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేశాడు. అందులో ఐదుగురిని తన ఫాంహౌస్‌లోనే పూడ్చిపెట్టాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ సీరియల్ కిల్లర్ ఉదంతంతో మహారాష్ట్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సతారా జిల్లాకు చెందిన 42 ఏళ్ల డాక్టర్ సంతోష్ పాల్ అలియాస్ ‘డాక్టర్ డెత్’. ఈయన గత కొన్నేళ్లలో (2003-2016 మధ్యకాలంలో) తన చీకటి ప్రపంచానికి, నేరాలకు అడ్డువచ్చిన ప్రతి ఒక్కరికీ అధిక మోతాదులో మెడిసిన్స్ ఇవ్వడం... ఆపై మృతదేహాలను తన ఫార్మ్‌హౌస్‌లోనే పూడ్చిపెట్టడం చేసేవాడు. ఇలా ఏకంగా ఆరుగురిని తన అకృత్యాలకు బలిచేశాడు. ఈ ఆరు హత్యల్లో నలుగురు బాధితుల మృతదేహాలను సోమవారం అర్ధరాత్రి నిందితుడి ఫాంహౌస్‌లో పోలీసులు వెలికితీశారు. ఒక అంగన్వాడీ వర్కర్ అపహరణ, హత్యతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో సంతోష్‌ను ఈ నెల 11న అరెస్ట్ చేసి, విచారించగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ సందీప్ పాటిల్ తెలిపారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడు డాక్టర్ సంతోష్ ఆరు హత్యలను తానే చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.,. మహారాష్ట్ర పూర్వ ప్రాథమిక్ శిక్షణ సేవికా సంఘ్ అధ్యక్షురాలైన జెద్దెను జూన్ 16న సంతోష్ చంపాడు. అక్రమ సంబంధంతో పాటు, నగదు, నగలపై దురాశతోనే సంతోష్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. సంతోష్‌కు జ్యోతి మండ్రే అనే నర్స్‌తో అక్రమ సంబంధం ఉండేది. జెద్దె ఆ సంగతి బయట పెడుతుందని ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. వీరిద్దరూ జెద్దెకు అధిక మోతాదులో మెడిసిన్‌ను ఇచ్చి హతమార్చి, డాక్టర్ ఫార్మ్‌హౌస్‌లోనే పూడ్చిపెట్టారు. జ్యోతి ఈ నేరాన్ని అంగీకరించింది. తర్వాత సంతోష్‌నూ అరెస్ట్ చేసి విచారిస్తే మిగిలిన హత్యలు వెలుగు చూశాయి. జెద్దెతో పాటు హత్యకు గురైన వారిలో సల్మా షేక్, జగబాయ్ పాల్, సురేఖ, వణిత గైక్వాడ్, నత్మాల్ ఉన్నారు. వీరందరిలో ఒక్క గైక్వాడ్ మృతదేహాన్ని తప్ప మిగిలిన వారి మృతదేహాలను ఫాంహౌస్‌లో కనుగొన్నారు. సంతోష్ 2008లో గైక్వాడ్‌ను చంపి మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేశాడు.


