సెల్ఫీకి బలి | Selfie death: Coimbatore teens hit by goods train, one dies, other hospitalised | Sakshi
Sakshi News home page

సెల్ఫీకి బలి

Jan 26 2018 2:39 AM | Updated on Nov 9 2018 4:36 PM

Selfie death: Coimbatore teens hit by goods train, one dies, other hospitalised - Sakshi

అన్నానగర్‌ (చెన్నై): సెల్ఫీ పిచ్చితో మరో యువకుడు ప్రా ణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవైకు చెందిన సుజీస్‌(18) ఓ కాలేజీలో బీకామ్‌ చదువుతున్నాడు. సెల్ఫీల పిచ్చి ఉన్న సుజీస్‌ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఓ గూడ్సు రైలు వస్తూ కన్పించింది. దీంతో పట్టాల దగ్గరకు వెళ్లిన సుజీస్, సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. రైలు సమీపిస్తున్నా పక్కకు వెళ్లకపోవడంతో గూడ్సు రైలు వ్యాగన్‌ అతని తలను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సుజీస్‌ను స్నేహితులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కోవై ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. కాగా, రైలు పట్టాలపై యువత సెల్ఫీలు, విన్యాసాలు లాంటి ప్రమాదకర పనులు చేయవద్దని  రైల్వే మంత్రి గోయల్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement